నెల్లూరులో ఇదీ పరిస్థితి.. మార్కెట్ విలువ (చదరపు గజం)
పెరిగిన విద్యుత్ చార్జీలు.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు.. ఠారెత్తిస్తున్న కూరగాయల రేట్లతో ప్రజల హాహాకారాలు
మిన్నంటిన వేళ.. వారిపై మరో బాదుడు మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. స్థలం.. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనే
సామాన్యుల ఆశను చిదిమేసే దిశగా అడుగులేస్తోంది. మార్కెట్ విలువలను భారీగా పెంచి అందిన కాడికి దండుకోవడమే ధ్యేయంగా
స్కెచ్ వేసింది. జిల్లాలో పది శాతం నుంచి 50 శాతం వరకు పెంచడంతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు రావాలంటేనే సామాన్యులు
జంకే పరిస్థితికి సర్కార్ తీసుకొచ్చింది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పెరగనున్న శాతం
Comments
Please login to add a commentAdd a comment