వైస్ చైర్మన్ల ఎన్నికలో పోటీకి సిద్ధం
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి ఫిబ్రవరి మూడున నిర్వహించనున్న వైస్ చైర్మన్ల ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుందని మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలతో గురువారం చర్చించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలుపొందిన 18 మంది కౌన్సిలర్లకు విప్‌ను జారీ చేయనున్నామని చెప్పారు. అధికార అండతో తొమ్మిది మంది కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకున్నారని, ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు. విప్‌ను ధిక్కరించి పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన వారిని అనర్హులుగా ప్రకటించనున్నారని చెప్పారు. పోటీ విషయంలో వెనుకడుగేసేదిలేదని తేల్చిచెప్పారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు పాల్గొన్నారు.
నేటి నుంచి
మోగనున్న పెళ్లిబాజాలు
● మే 18 వరకు శుభ ముహూర్తాలు
ఆత్మకూరు రూరల్: అతి పవిత్రంగా భావించే మాఘమాసం ప్రారంభమైన నేపథ్యంలో వివాహ వేడుకలతో తెలుగు లోగిళ్లలో సందడి శుక్రవారం ప్రారంభం కానుంది. పెళ్లిబాజాలు మోగేందుకు ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయమైపోయాయి. ఫిబ్రవరిలో అధికంగా శుభ ముహూర్తాలున్నాయని వేదపండితులు తెలిపారు. ఫిబ్రవరిలో 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25వ తేదీలు.. మార్చిలో 1, 2, 6, 7, 12వ తేదీలు.. ఏప్రిల్‌లో 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30వ తేదీలు.. మేలో 1, 5, 6, 8, 15, 17, 18.. జూన్‌లో 1, 2, 4, ఏడో తేదీల్లో మాత్రమే పెళ్లి ముహూర్తాలున్నాయి. దీంతో తమ పిల్లల వివాహాలు చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు తమకు అనుకూలమైన శుభ ముహూర్తం కోసం అవసరమైన యత్నాలు చేసుకుంటున్నారు.
రాజరాజేశ్వరి
ఆలయంలో వేలం
నెల్లూరు(బృందావనం): నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 2025 – 26కు సంబంధించిన హక్కులను లీజుకు ఇచ్చేందుకు, అవసరమైన సామగ్రిని సరఫరా చేసేందుకు ఈ – టెండర్, సీల్ట్ టెండర్, బహిరంగ వేలాన్ని గురువారం నిర్వహించారు. ఎనిమిది విభాగాలకు గానూ కొబ్బరి చిప్పలు, పాదరక్షలు, పుస్తకాలకు సంబంధించిన వేలాన్ని జరిపారు. మిగిలి న వాటి వేలాన్ని ఫిబ్రవరి పదిన నిర్వహించనున్నామని ఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పర్యవేక్షణాధికారిగా శ్రీధర్‌నాయుడు వ్యవహరించారు.
పెంచలకోనలో
4న రథసప్తమి
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో రథసప్తమి వేడుకలను ఫిబ్రవరి నాలుగున నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పెనుశిల లక్ష్మీనృసింహుడు సప్త వాహనాల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment