వేగంగా పడిపోతున్న భూగర్భ జల మట్టం
వాగుల్లో ఉన్న నీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి సుమారు 20 వేల ఎకరాలు వరకు వివిధ పైర్లు సాగు చేస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్న కారు రైతులే ఉన్నారు. ముఖ్యంగా వరి, కర్రపుచ్చ, మొక్కజొన్న, సజ్జ, మినుము తదితర పంటలు సాగులో ఉన్నాయి. ఇసుక నిల్వలు ఎక్కువగా ఉంటే భూగర్భ జలం అందుబాటులో ఉంటుంది. దీంతో వేసవిలో కూడా బోర్లు, బావుల్లో నీటి కొరత ఉండదు. కానీ ఇసుక తోడేస్తే కేవలం మట్టి పొరలు బయటపడి నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉండదు. దీంతో మార్చిలోనే బోర్లుల్లో నీరు లభ్యత ఉండక ఎండిపోయే అవకాశం ఉందని, ప్రస్తుతం సాగులో ఉన్న పైర్లు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment