● రోజుకో ఆడియో వైరల్
నెల్లూర(క్రైమ్): నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ రాజారావు అవినీతిపై రోజుకో ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సూపరింటెండెంట్ రాజారావుతో పాత ఖైదీ రాకేష్ మాట్లాడుతున్నట్లు ఉన్న ఆడియో రికార్డులు ఇటీవల వైరల్ అయిన విషయం విదితమే. తాజాగా మంగళవారం మరో వ్యక్తి సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్నట్లు ఉన్న ఆడియో రికార్డులు సోషల్ మీడియాల్లో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ‘ఖైదీకి అన్నీ సౌకర్యాలు కల్పించేందుకు నగదు ఇస్తారని, ఇలా రెండు, మూడు విషయాలు చేశానని, జైల్లో మహిళా ఖైదీలు ఒకరిద్దరు అందంగా ఉంటారని, కొందరు మేకప్ వేసుకుంటారని, రాజమండ్రిలో ఉన్న సమయంలో మంచి అందగత్తెలు ఉండే వారని, ఇక్కడున్న వారంతా తొట్టి గ్యాంగ్ అని, జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధిని దుర్భాషలాడిన ఓ ఆడియో రికార్డు వైరల్ అవుతోంది. ఇప్పటికే సదరు ఆడియో రికార్డుల్లో ఉన్న వాయిస్ తనది కాదని, ఈ విషయాల్లో విచారణ చేయాలని తానే ఉన్నతాధికారులను కోరినట్లు రాజారావు వెల్లడించిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రి స్పందించి విచారణకు ఆదేశించారని సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. కావాలని కొందరు జైలు సూపరింటెండెంట్‌పై ఈ విధంగా చేస్తున్నారా? లేదా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. జైలు ఉన్నతాధికారులు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment