చెక్కనగిషీ కేంద్రం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి
ఉదయగిరి: ఉదయగిరి చెక్కనగిషీ కేంద్రం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారిణి నాగరాజకుమారి తెలిపారు. ఉదయగిరిలోని దిలావర్బాయి వీధిలో ఉన్న చెక్కనగిషీ కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. కేంద్రంలో వసతులు, కళాకారులతో చెక్కబడిన వివిధ రకాల ఉపకరణాలను పరిశీలించారు. అనంతరం కేంద్ర నిర్వాహకులు గౌసియాబేగం, జాకీర్హుస్సేన్తో కేంద్ర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడెక్ట్లో భాగంగా ఉదయగిరి చెక్కనగిషీ వస్తువుల మార్కెటింగ్ సౌకర్యం, ప్రభుత్వం నుంచి సాయంపై ఉన్నతాధికారులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంలో వీలైనంత వరకు ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన భవనం మంజూరు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.
ఉల్లాసంగా.. ఉల్లాస్..
స్థానిక సీ్త్రశక్తి భవనంలో జరిగిన ఉల్లాస్లో ఆమె పాల్గొన్నా రు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలపై ఈఓఏలు, వలంటీర్లతో సమీక్షించారు. వలంటీర్లు ప్రతి రోజూ కేంద్రాలను నిర్వహించి పుస్తకాల ద్వారానే కాకుండా వీడియోల ద్వారా కూడా అవగాహన కల్పించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వం పొదుపు మహిళలకు రాయితీతో పీఎం సూర్య ఘర్ పథకాన్ని వర్తింపజేస్తున్నందున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment