భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

భద్రత కల్పించాలి

Published Sat, Aug 24 2024 1:10 PM | Last Updated on Sat, Aug 24 2024 1:10 PM

భద్రత

కోల్‌కతాలో జూనియర్‌ మహిళా వైద్యురాలిపై జరిగిన పాశవిక సంఘటన దుర్మార్గం. ప్రాణాలు పోసే వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఎలా..? సమాజంలోనూ మార్పు రావాలి. ప్రభుత్వాలు కూడా ఆస్పత్రుల వద్ద మహిళా వైద్యులు, సిబ్బందికి భద్రత కల్పించాలి. ప్రత్యేకంగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలి. ప్రతి పీహెచ్‌సీకి నైట్‌ వాచ్‌మెన్‌ను నియమించాలి. క్వార్టర్స్‌ వద్ద కూడా సదుపాయాలు కల్పించాలి.

– శాంతి, మెడికల్‌ ఆఫీసర్‌, గుండుమల

సమాజంలో మార్పు రావాలి

కోల్‌కతా ఘటన చాలా బాధాకరం. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు రూపొందిస్తున్నా ఆచరణలో కనిపించడం లేదు. మంచి, చెడును అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ చెప్పాలి. అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అంతిమంగా సమాజంలో మార్పు వస్తేనే అమ్మాయిలకు భద్రత సాధ్యం. ఆస్పత్రుల్లోనూ మహిళా సిబ్బందికి భద్రతతో పాటు సౌకర్యాలను కల్పించాలి. ప్రధాన ఆస్పత్రుల వద్ద రాత్రి వేళల్లో పోలీసులు ఉండే విధంగా చూడాలి.

– సరస్వతి, హెల్త్‌ సూపర్‌వైజర్‌, కల్లుమర్రి పీహెచ్‌సీ, మడకశిర మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
భద్రత కల్పించాలి 
1
1/2

భద్రత కల్పించాలి

భద్రత కల్పించాలి 
2
2/2

భద్రత కల్పించాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement