అదుపులోకి రాని అతిసారం | - | Sakshi
Sakshi News home page

అదుపులోకి రాని అతిసారం

Published Sat, Aug 24 2024 1:10 PM | Last Updated on Sat, Aug 24 2024 1:10 PM

అదుపులోకి రాని అతిసారం

గుడిబండ మండలం కొంకల్లులో

కొత్తగా నాలుగు కేసులు

రొళ్ల మండలం ఎం.రాయాపురంలోనూ మూడు కేసులు

గుడిబండ/రొళ్ల: అతిసారం ఇంకా అదుపులోకి రాలేదు. వైద్య, ఆరోగ్యశాఖ గ్రామంలో వైద్య శిబిరాలు కొనసాగిస్తూ ప్రజలకు సూచనలు ఇస్తున్నప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గుడిబండ మండలం కొంకల్లులో ఇప్పటికే అతిసారంతో ఏడుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గ్రామస్తులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే రొళ్ల మండలం ఎం.రాయాపురంలోనూ ముగ్గురు మృతి చెందారు. తాజాగా శుక్రవారం కొంకల్లులో నాలుగు కేసులు, రొళ్ల మండలం ఎం.రాయాపురంలో మూడు కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. బాధితులకు స్థానిక వైద్య శిబిరాల్లోనే చికిత్స అందిస్తున్‌న్రాు. డీపీఎంఓ కుళ్లాయప్ప నాయక్‌, వైద్య సిబ్బంది కొంకల్లులో ఇంటింటా ఫీవర్‌ సర్వే చేశారు. ఈ సందర్భంగా అతిసారం బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలను ప్రజలకు వివరించారు. సర్పంచ్‌ కవిత, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్‌, వైద్య సిబ్బందితో కలిసి ‘దోమకాటు మనిషికి చేటు’ అంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇక రొళ్ల మండలం ఎం.రాయాపురంలో మడకశిర డివిజన్‌ మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి షమీవుల్లా పర్యటించారు. పారిశుధ్య కార్మికులతో దోమల నివారణ కోసం మందును పిచికారీ చేయించారు. ఎంపీపీ కవిత గ్రామంలో పర్యటించి అతిసారం బాధితుల ఆరోగ్య పరిస్థితి, వ్యాధి తీవ్రతను అడిగి తెలుసుకున్నారు.

27న ఖాద్రీ ఆలయంలో

కృష్ణాష్టమి వేడుకలు

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 27న కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ రోజు శ్రీవారి సన్నిధిలో అభిషేకాలు ఉంటాయని, రాత్రి రంగమండపంలో శ్రీవారికి ఉయ్యాలోత్సవం నిర్వహిస్తామన్నారు. 28వ తేదీ రాత్రి ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉంటుందని ఈఓ వెల్లడించారు.

30న సామూహిక వరలక్ష్మీ వ్రతం

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీన సామూహిక శ్రావణ వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన దలచిన వారు ముందుగా ఆలయంలో 28వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 30వ తేదీ (శుక్రవారం) ఉదయం 9.30 గంటలకు కలశపూజ, 10 గంటలకు సామూహిక వరలక్ష్మీ వ్రతం ఉంటుందన్నారు. వ్రతంలో పాల్గొనాలనుకునే వారు కలశము, పూజా సామగ్రి, పూలు, పండ్లు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement