No Headline
అనంతపురం సర్వజనాస్పత్రిలోని మందుల గది వద్ద జనం రద్దీ
● ఉమ్మడి జిల్లాలోని ఆస్పత్రుల్లో నిండుకున్న మందులు
● ఇండెంట్ పెట్టినా స్పందించని సర్కారు
● అత్యవసర మందులకూ దిక్కులేని పరిస్థితి
● బీ12 ఇంజెక్షన్లు లేక రోగుల విలవిల
● యాంటీబయోటిక్స్ లేక బయటికి చీటీలు రాస్తున్న వైద్యులు
● మంత్రి సత్యకుమార్ నియోజకవర్గంలోనూ మందుల కొరత
● గత ఐదేళ్లూ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితే లేదు
● జ్వరాల సీజన్‌లో కొరత నెలకొనడంతో తీవ్ర ఇబ్బందులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆస్పత్రుల్లో మందుల కొరత సామాన్య రోగులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కూటమి సర్కారు వచ్చి నాలుగు నెలలు కూడా నిండక ముందే మందుల నిల్వలు పూర్తిగా కరిగిపోయాయి. దీంతో రోగులు బయట షాపుల్లో కొనుగోలు చేస్తున్న దుస్థితి నెలకొంది. ఆస్పత్రుల్లో మందులపై అడిగితే ‘విజయవాడ నుంచే రావడం లేదు.. ఇండెంట్ పెట్టాం’ అంటున్నారు. అసలే జ్వరాల సీజన్ కావడంతో రోగులు మందులు లేక సతమతమవుతున్నారు. గడిచిన ఐదేళ్లూ ఒక్క ఆస్పత్రిలో కూడా మందులు లేవు అనే మాట వినిపించలేదు.
మంత్రి సొంత ఇలాకాలోనూ దుస్థితి..
ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలోనే మందులు లేక డాక్టర్లు బయటకు చీటీలు రాస్తున్నారు. 25 రకాలకు పైగా మందులు లేవు. స్వయానా ఓ అమాత్యుడి నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి నెలకొనడం విస్మయానికి గురి చేస్తోంది.
సూదికీ, దూదికీ దిక్కులేదు..
ప్రమాదాల్లో గాయపడిన వారికి కుట్లు వేయడానికి సూది, దూది అత్యవసరం. కానీ కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవి కూడా లేవు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన కొంతమంది రోగుల సహాయకులు బయటినుంచి దూది తెచ్చి డాక్టర్లకు ఇస్తున్నట్టు తేలింది. 2019 జూన్ నుంచి 2024 మార్చి వరకూ మందులకు లోటు లేకుండా ఉండేది. ఎప్పటి కప్పుడు బఫర్ స్టాకు తెచ్చి పెట్టేవారు. ఇప్పుడేమో మందులన్నీ ఖాళీ అయ్యాయి. ఈ మందులు రావడానికి మరో మూడు మాసాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిగో ఇప్పుడు అప్పుడు అంటూ జాప్యం చేస్తున్నారని ఓ పీహెచ్‌సీ డాక్టర్ వాపోయారు.
ఈ ఫొటోలో కన్పిస్తున్న బాలింత పేరు జ్యోతి. యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం
అందించడంలో భాగంగా సర్వజనాస్పత్రి గైనిక్ వైద్యులు జ్యోతికి పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిట్‌ఇన్‌ఫ్యూషన్ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో ఆ మందులు లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకూ ఖర్చు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment