దేవీ వైభవం
పుట్టపర్తి టౌన్: దేవీశరన్నర రాత్రి ఉత్సవాలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. బుధవారంతో భాద్రపద మాసం ముగియగా, గురువారం నుంచి ఆశ్వీజం ప్రారంభం అవుతోంది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమ్మవారి ఆలయాలను దీపకాంతులతో అలంకరించారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి సత్తెమ్మ ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం, చిత్రావతి ఒడ్డున, ఎనుములపల్లి వద్ద ఉన్న దుర్గామాత ఆలయాలు ఇప్పటికే ముస్తాబయ్యాయి. జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దేవీశరన్నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా జగన్మాత తొమ్మిది విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగనున్నాయి. రోజు సాయంత్రం సాంస్కృతిక సంబరాలు ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
ముస్తాబైన అమ్మవారి ఆలయాలు
Comments
Please login to add a commentAdd a comment