అమరవీరుల అడుగుజాడల్లో నడుద్దాం
పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ రత్న పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పుట్టపర్తిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విఽధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సీఐలు ఇందిర, సునీత, సురేష్, నరేంద్రరెడ్డి, ఆర్‌ఐలు వలి, మహేష్, రవికుమార్, ఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ప్రదీప్, వీరన్నతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే నేర నియంత్రణ
సమష్టి కృషితోనే నేరాల నియంత్రణ సాధ్యమని, ఆ దిశగా పోలీసులంతా పనిచేయాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం పోలీస్ కార్యాలయంలోని కాన్సరెన్స్ హాలులో హిందూపురం సబ్ డివిజన్‌కు సంబంధించిన నెలవారీ నేర సమీక్షా నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులు వివరాలు తెలుసుకున్నారు. కోర్టు కేసుల పురోగతిపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, హత్య, పోక్సో, రోడ్డు ప్రమాద కేసులపై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తే జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించవచ్చన్నారు. సాటుసారా విక్రయాలు, మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. విజుబుల్ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో కాలనీలు సందరిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. మిస్సింగ్, చోరీ కేసులపై దృష్టి సారిస్తూ రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. చోరీల నివారణకు రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేయాలన్నారు. నేర నియంత్రణే ప్రథమ లక్ష్యంగా పనిచేయాలన్నారు. అలాగే సరిహద్దు చెక్ పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, లీగల్ అడ్వైయిజర్ సాయినాథరెడ్డి, ఏఓ సుజాత, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సీఐలు ఆంజనేయులు, శ్రీనివాసులు, గోపీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
పోలీసు అమరవీరుల
సంస్మరణ వారోత్సవాల్లో ఎస్పీ రత్న
Comments
Please login to add a commentAdd a comment