త్రిలింగ క్షేత్ర దర్శనానికి ప్రత్యేక బస్సులు
పుట్టపర్తి టౌన్: కార్తీక మాసంలో త్రిలింగ దర్శనం పేరుతో తాడిపత్రి బుగ్గరామలింగేశ్వరస్వామి, యాగంటి, మహానంది క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను బుధవారం తన కార్యాలయంలో ఆయన విడుదల చేసి, మాట్లాడారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకూ తాడిపత్రి బుగ్గరామలింగేశ్వరాలయం, బనగానిపల్లి వద్ద ఉన్న యాగంటి, నంద్యాల వద్ద ఉన్న మహానంది క్షేత్రాలకు ప్రతి సోమవారం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఉదయం 5 గంటలకు బస్సులు బయలుదేరి, తిరిగి సాయంత్రం ఆయా డిపోలకు చేరుతాయన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతామన్నారు. ఓ గ్రామం నుంచి 40 మంది భక్తులు వెళ్లాలనుకుంటే ఆ గ్రామం నుంచే బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ సదుపాయంతో పాటు సమీప బస్‌స్టేషన్, ఏటీబీ ఏజెంట్ల వద్ద కూడా రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment