భారీగా పోలీసుల బదిలీలు
పుట్టపర్తి టౌన్: జిల్లాలో భారీగా పోలీసు బదిలీలు జరిగాయి. ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 60 మంది కానిస్టేబుళ్లను స్థాన చలనం కల్పిస్తూ సోమవారం రాత్రి ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. కదిరి రూరల్ ఆప్‌గ్రేడ్ పోలీస్టేషన్ సీఐ మోహన్‌ను వీఆర్‌కు పంపి, వీఆర్‌లో ఉన్న నిరంజన్‌రెడ్డికి కదిరి రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు. ఎస్ఐల బదిలీకి సంబంధించి వీఆర్‌లో ఉన్న ఇషాక్బాషాను ముదిగుబ్బ పీఎస్‌కు, వి. మహమ్మద్ అలీని సీసీఎస్‌కు, ఎన్. రమణారెడ్డిని కదిరి రూరల్ యూపీఎస్‌కు, జి. రాజప్రసాద్ను హిందూపురం టూటౌన్‌కు, ఎస్. జయప్పను పీసీఆర్ (పుట్టపర్తి), ఓ.బ్రహ్మానందరెడ్డిని హిందూపురం టూటౌన్‌కు, కియా ఎస్ఐగా ఉన్న ఎస్.నజీర్ అహమ్మద్‌ను రోడ్‌సేఫ్టీ విభాగం (పెనుకొండ సబ్‌డివిజన్)కు, సీకేపల్లిలో ఉన్న బి. సూర్యనారాయణను రోడ్‌సేఫ్టీ విభాగం (ధర్మవరం సబ్‌డివిజన్)కు, వీఆర్‌లో ఉన్న మునిప్రతాప్ను హిందూపురం యూపీఎస్, రాజకుళ్లాయప్పను గుడిబండ పీఎస్‌కు బదిలీ చేశారు. వీరితో పాటు జిల్లాలోని 60 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 60 మంది కానిస్టేబుళ్లకు స్థాన చలనం
Comments
Please login to add a commentAdd a comment