వైభవంగా చౌడేశ్వరీదేవి ఉత్సవాలు
తాడిమర్రి: మండలంలోని పెద్దకోట్ల గ్రామంలో ఆదివారం ప్రారంభమైన చౌడేశ్వరిదేవి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఆలయ ధర్మకర్త పాటిల్ భువనేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పాటిల్ ప్రకాష్‌రెడ్డి, పాటిల్ కపిల్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము 5 గంటలకే ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు జ్యోతుల ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గుడ్డంపల్లి, బంగారంపేట, చిల్లకొండయ్యపల్లి, మోదుగులకుంట, తాడిమర్రి, మరవపల్లి, మద్దులచెర్వు, శివంపల్లి తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. గుడికట్టుదారులు అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం జంతు బలిదానంతో మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో కంచెం మురళీమోహన్‌రెడ్డి, అశ్వత్థరెడ్డి, సౌరెడ్డి, సర్పంచ్ శ్రీరాములు, మాజీ సర్పంచులు వెంకట, వరద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment