1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
పుట్టపర్తి అర్బన్: హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌లపై ప్రజలను చైతన్య పరుస్తూ ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది నిర్వహించబోయే కార్యక్రమానికి సంబంధించి సోమవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఆమె సమీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వివిధ ప్రాంతాల్లో హైరిస్క్ గ్రూపు, హెచ్‌ఐవీ బాఽధితులతో రంగోళి పోటీలను నిర్వహించారు. వాటిని వైద్యాధికారులు పరిశీలించి ప్రత్యేకమైన ముగ్గులను ఎంపిక చేసి జాబితా రూపొందించారు. వీరందరికీ డిసెంబర్ 1న బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీల్లో వేసిన ముగ్గులను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. జిల్లా ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ తిప్పయ్య, ప్రోగ్రాం అధికారి భాస్కర్, డాక్టర్ గాయత్రి, టీబీ యూనిట్ ఇన్‌ఛార్జి నాగేంద్ర, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు బలరాం, ఆంజనేయులు, విహాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment