గుత్తి: వివాహ వేడకలో మర్యాదల విషయంగా ఘర్షణ చోటు చేసుకుని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి గ్రామంలో సోమవారం రాత్రి వివాహ వేడుక మొదలైంది. ఈ క్రమంలో తాంబూలం అందిపుచ్చుకునే విషయంలో కిష్టిపాడుకు చెందిన కొందరు గుత్తికి చెందిన వారితో ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి పరస్పర దాడులు చేసుకున్నారు. ఘటనలో మాబు, ఆసీఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment