భర్త మందలింపు.. భార్య ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భర్త మందలింపు.. భార్య ఆత్మహత్య

Published Wed, Jan 29 2025 12:55 AM | Last Updated on Wed, Jan 29 2025 12:55 AM

భర్త మందలింపు.. భార్య ఆత్మహత్య

భర్త మందలింపు.. భార్య ఆత్మహత్య

అనంతపురం: భర్త మందలింపుతో మనస్తాపం చెంది భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఎన్‌పీ కుంట మండలం వడ్డిపల్లి గ్రామానికి చెందిన రమణయ్య కుమార్తె అశ్విని (25)కి అదే గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ కుమారుడు గంగాధర్‌తో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం గంగాధర్‌ కువైట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో కుటుంబపోషణకు భర్త సంపాదన సరిపోదని భావించిన అశ్విని... అనంతపురంలోని శ్రీనగర్‌ కాలనీలో కేవీఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పనులతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన ఆమె ఈ నెల 24న వడ్డిపల్లిలోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఈ నెల 25న కువైట్‌ నుంచి గంగాధర్‌ ఫోన్‌ చేసి అశ్వినితో మాట్లాడాడు. ఆ సమయంలో ఆమె ఇంకా అనంతపురానికి వెళ్లకపోవడంతో తీవ్ర స్థాయిలో మందలించాడు. దీంతో ఆమె అనంతపురానికి చేరుకుంది. అప్పటి నుంచి తరచూ ఇద్దరూ ఫోన్‌లోనే గొడవ పడుతూ వచ్చారు. సోమవారం పలుమార్లు గంగాధర్‌ ఫోన్‌ చేసినా అశ్వని సమాధానం ఇవ్వలేదు. దీంతో తన బంధువు తిరుమలేష్‌కు ఫోన్‌ చేసి అశ్వినితో మాట్లాడాడు. ఫోన్‌ ఎత్తడం లేదంటూ దుర్భాషలాడాడు. దీంతో క్షణికావేశానికి లోనైన ఆమె మంగళవారం ఇంట్లోని ఎలుకల మందును నీటిలో కలుకుని తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించిక ఆమె మృతి చెందింది. ఘటనపై నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement