అప్పట్లో పింఛన్‌దారు చనిపోతేనే..
జిల్లాలో మొత్తం మండలాలు : 32 గ్రామ సచివాలయాలు : 420 వార్డు సచివాలయాలు : 124 రేషన్‌కార్డుల సంఖ్య : 5,62,784 పింఛన్‌దారుల సంఖ్య : 2,70,853
కొత్త రేషన్‌కార్డుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో వేలాది మందికి పెళ్లిళ్లు అయ్యాయి. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడి బయటకు వచ్చిన వారూ ఉన్నారు. రేషన్‌కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎంతోమంది వివిధ కారణాలతో మరణించారు. ఈ క్రమంలో కార్డులో సభ్యుల తొలగింపు.. కొత్తగా రేషన్‌కార్డుల కోసం వేలాది మంది సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక వితంతువులు, ఒంటరి మహిళలు పెరిగిపోయారు. వీరితో పాటు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు, కన్ను కోల్పోయిన వారు ఉన్నారు. వీరంతా పింఛన్ల కోసం సచివాలయ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
● కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపు
● నేటికీ తెరుచుకోని పింఛన్ల వెబ్సైట్
● అధికారులు, నాయకుల చుట్టూ అర్హుల ప్రదక్షిణలు
ధర్మవరం రూరల్: ‘కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. ఇప్పుడిప్పుడే పింఛన్లు ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి. రోజూ కార్యాలయాల చుట్టు తిరిగినా ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం కొత్త ఫించన్ల కోసం ఎప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తుందో అప్పుడు రండి. అప్పటి వరకూ మీరు మా చుట్టూ తిరగొద్దు’ అంటూ అధికారులు, నాయకులు అంటుంటే అర్హులు తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా... నేటికీ కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ మొదలు కాలేదు. అలాగే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
అర్హత ఉన్నా ఎదురుచూపులే...
అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు ఇచ్చిన హామీపై నేటికీ స్పష్టత లేకపోవడంతో పలువురు పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతూ వచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారికి వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే అర్హత పత్రాలను అందజేశారు. ఈ ప్రక్రియను గత ప్రభుత్వం నిరంతరం కొనసాగించింది. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. పింఛన్, రేషన్ కార్డు పొందేందుకు అన్ని అర్హతలున్నా.. ఎదురుచూపులు తప్పడం లేదు.
పింఛన్లు తొలగించే
కుట్ర
2014–19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామాలలో ఎవరైనా పింఛన్‌దారు చనిపోతే ఆ స్థానంలో మరొకరికి పింఛన్ ఇచ్చే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు మళ్లీ వస్తున్నాయని పింఛన్‌దారులు అంటున్నారు. పరిశీలన పేరుతో గ్రామాలలో అర్హులైన కొత్త మంది పింఛన్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు. ప్రస్తుతమున్న పింఛన్లను రద్దు చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో పరిశీలన పేరుతో ఏరివేత ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అన్ని అర్హతలు ఉన్న దివ్యాంగ పింఛన్‌దారులకు నోటీసులు ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలో మరోసారి పరిశీలన చేయించుకురావాలని అధికారులు సూచిస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా 2,70,853 మంది లబ్ధిదారుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment