జగనన్న పాలనలోనే ప్రైవేటు బోధన సిబ్బందికి న్యాయం | Sakshi
Sakshi News home page

జగనన్న పాలనలోనే ప్రైవేటు బోధన సిబ్బందికి న్యాయం

Published Fri, Apr 19 2024 1:30 AM

స్పీకర్‌తో ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు  - Sakshi

ఆమదాలవలస: ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వైఎస్సార్‌ సీపీ పాలనలోనే న్యాయం జరిగిందని పలువురు బోధన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస పట్టణంలోని స్పీకర్‌ క్యాంపు కార్యాలయం వద్ద కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ దుంపల రామారావు ఆధ్వర్యంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కలిశారు. ఈపీఎఫ్‌, ఈహెచ్‌ఎస్‌ సౌకర్యం కల్పించేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం, ఎంపీగా పేరాడ తిలక్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కలెక్టర్‌ను కలిసిన

వ్యయ పరిశీలకుడు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ను వ్యయ పరిశీలకుడు నవీన్‌కుమార్‌ సోని గురువారం గౌరవ పూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ కార్యాలయంలో కలిసి ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి చర్చించారు. అనంతరం వ్యయ పరిశీలకుల బృందంతో సమావేశమయ్యారు.

కలెక్టర్‌తో నవీన్‌కుమార్‌ సోని
1/1

కలెక్టర్‌తో నవీన్‌కుమార్‌ సోని

Advertisement
 
Advertisement