వైఎస్సార్‌ సీపీ వెంటే కాళింగ సామాజికవర్గం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ వెంటే కాళింగ సామాజికవర్గం

Published Thu, May 9 2024 4:15 AM

వైఎస్సార్‌ సీపీ వెంటే కాళింగ సామాజికవర్గం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కాలింగ సామాజికవర్గమంతా వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ దుంపల రామారావు(లక్ష్మణరావు) అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో కాళింగ సామాజిక వర్గం బలాన్ని గుర్తించి జిల్లాలో ప్రస్తుతం ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించారన్నారు. 2019లో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ప్రకటించినప్పటికీ స్వల్ప తేడాతో ఓడినప్పటికీ, ఒకరికి ఎమ్మెల్సీగా, ఒకరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా, ఒకరికి రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారన్నారు. తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా నియమించి అత్యున్నత పదవిని అందించి సామాజిక వర్గానికి గౌరవించారని గుర్తు చేశారు. కాళింగ సామాజిక వర్గానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి జిల్లాకు చైర్మన్‌ను నియమించడం గొప్ప విషయమన్నారు. సీఎం జగన్‌కు అండగా నిలిచి వైఎస్సార్‌సీపీ గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బాడాన కృష్ణారావు, పప్పల రాధాకృష్ణ, తమ్మినేని మురళి, తమ్మినేని వాసుదేవరావు, బొడ్డేపల్లి గంగాధర్‌, గురుగుబిల్లి లక్ష్మణరావు, మొదలవలస పాపారావు, గురుగుబెల్లి కృష్ణారావు, మెట్ట శ్యామలరావు, కూన సత్తిబాబు, దుంపల గోవిందరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement