రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం | Sakshi
Sakshi News home page

రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం

Published Fri, May 10 2024 8:05 PM

రూ.70

రోనా సమయంలో నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లలేని పరిస్థితిలో వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యక్తిగతంగా తమ సొంత సొమ్ముతో కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేశారు. ఎక్కడికక్కడ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా వలంటీర్లను పెట్టుకుని తోచినంత సాయం చేశారు. ఇక ప్రభుత్వం ప్రతీ ఇంటికి సాయం చేసింది. ఒకవైపు కోవిడ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా ఆక్సిజన్‌ సిలిండర్లతో పాటు ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోగులకు పౌష్టికాహారం అందజేసింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు ఇంటింటికీ ఉచితంగా మందులు పంపిణీ చేసింది. ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఇంటికి మెడికల్‌ కిట్‌ అందజేసింది. అంతటితో ఆగకుండా ప్రతి ఇంటికి ఆర్థిక సాయం చేసింది. జిల్లాలో 6,70,438 మందికి రూ.707.61కోట్లు మేర సచివాలయంలోనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. అంతేకాకుండా విదేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లోనూ చిక్కుకున్న వారిని ప్రత్యేక బస్సులు, ట్రైన్‌లు, విమానాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు క్షేమంగా తీసుకొచ్చింది. ముఖ్యంగా జిల్లాలోని వలస కూలీలు, వలస మత్స్యకారులను ప్రత్యేక జాగ్రత్తలతో తీసుకొచ్చి, ప్రత్యేక క్వారంటైన్‌ ఏర్పాటు చేసి, ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చర్యలు తీసుకుంది.

రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం
1/1

రూ.707.61కోట్లు ప్రభుత్వ సాయం

Advertisement
 
Advertisement
 
Advertisement