వివాహిత అనుమానాస్పద మృతి
జై భీమ్..
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని పాతపట్నం ప్రభుత్వ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కేవీ రత్నకుమారి అన్నారు. సోమవారం పాతపట్నం ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు ‘జై భీమ్’ అక్షరాకృతిలో కూర్చుని ఆకట్టుకున్నారు.
– పాతపట్నం
● అత్తింటివారే చంపేశారని ఆరోపణ
కాశీబుగ్గ: పలాస మండలం కేదారిపురం పంచాయతీ ఈదురాపల్లి గ్రామంలో పైల నీరజాక్షి (24) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే తమ కుమార్తెను చంపేశారని మెళియాపుట్టి మండలం టకోయి గ్రామానికి చెందిన నీరజాక్షికి తండ్రి సంపతిరావు ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతురాలి భర్త పైల జయరాం అలియాస్ వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేస్తూ సెలవుపై పదిహేను రోజులు క్రితం జయరాం ఇంటికి వచ్చారు. వీరికి ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన వివాహం జరిగింది. ఆదివారం రాత్రి నీరజాక్షి ఫోన్‌చేసి తనను అత్తవారింట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పిందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు మరణించేంత పిరికిది కాదని ఆమెను ఆడపడుచూ, భర్త కలిసి చంపేశారని ఆవేదన చెందారు. మరణానికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment