కిడ్నీరోగులకు అండగా ఉందాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్దానం ప్రాంతంలో పెరుగుతున్న కిడ్నీ బాధితులను నిరంతరం పర్యవేక్షించి వారి రోగాన్ని కుదుటపరిచేలా చేసే బాధ్యత మనందరికీ ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు జూనైద్ అహ్మద్ మౌలానా అని తెలిపారు.
ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైద్యులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు అన్ని వర్గాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి పని చేయాలని సూచించారు.
ఉద్దానం కమిటీలో ఉన్న వైద్యులు, నెఫ్రాలజిస్టులు, సైకాలజిస్టులు, ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ కలిసి ప్రత్యేకంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులపై దృష్టి పెట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment