పోర్టు నిర్వాసితుల వాగ్వాదం
టెక్కలి: టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మూలపేట పోర్టు నిర్వాసితులు సోమవారం వాగ్వాదానికి దిగారు. పోర్టు నిర్మాణంలో భాగంగా గతంలో సేకరించిన భూముల వివరాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వే చేపట్టారు. ఈ రీసర్వేలో నిర్వాసితులకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల ప్రాప్తికి కార్యాలయంలో అధికారులు మరోసారి వివరాలను పరిశీలించే ప్రక్రియ చేపడుతున్నారు. అయితే భూముల వివరాల గల్లంతు విషయంలో నిర్వాసితుల మధ్య వాగ్వాదం తలెత్తడంతో కార్యాలయం ఆవరణలో గందరగోళం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment