కలెక్టర్ గ్రీవెన్స్‌కు 65 అర్జీలు
మీకోసంలో నమోదైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 65 అర్జీలు అందాయి. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వీ శ్రీధర్ రాజ ఉన్నారు. –శ్రీకాకుళం పాతబస్టాండ్
Comments
Please login to add a commentAdd a comment