No Headline
జిల్లా నుంచి ఐపీఎల్ వరకు వెళ్లిన మొదటి క్రికెటర్‌గా త్రిపురాన విజయ్ గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పాఠశాల దశలో క్రికెట్‌పైన మక్కువతో త్రిపురాన విజయ్ 2013–14లో అరంగ్రేటం చేశాడు. అంతర్ జిల్లాల నార్త్‌జోన్ అండర్–14 జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రదర్శనతో రాణించడంతో కడప క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌స్పిన్ మ్యాజిక్‌తో విశేషంగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతున్నాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో రిజిస్టర్ చేసుకున్న విజయ్‌ను ఢిల్లీ డేర్ క్యాపిటల్స్ జట్టు అదే ధరకు కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలో ఈ ఐపీఎల్ వేలం జరిగింది. వేలంలో డీసీ జట్టు కొనుగోలు చేసిందని తెలిశాక క్రికెట్ తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు.
మూడేళ్లుగా నిలకడగా రాణింపు..
విజయ్ పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా.. గత మూడే ళ్లుగా నిలకడ చూపిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలెక్షన్స్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. కుచ్‌బిహార్ ట్రోఫీ, విజయ్‌హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోర్నీలు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్ ఎంపిక కచ్చితంగా జరుగుతుందని తల్లిదండ్రులతోపాటు జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు ఆశించారు. వారి ఆశలు నిజమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక క్రికెటర్ ఐపీఎల్‌కు చేరువ కావడం గర్వంగా ఉందని జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లను తయారుచేస్తామని వారు చెబుతున్నారు.
పూర్తిపేరు త్రిపురాన విజయ్
వయస్సు 22 ఏళ్లు
తల్లిదండ్రుల త్రిపురాన వెంకట కృష్ణరాజు,
పేర్లు లావణ్య
నివాసం టెక్కలిలోని అయ్యప్పనగర్
విద్యాభ్యాసం డిగ్రీ ఫస్టియర్ (టెక్కలి)
బ్యాటింగ్ శైలి రైట్‌హ్యాండ్ బ్యాటర్
బౌలింగ్ శైలి రైటార్మ్ ఆఫ్ స్పిన్
ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం త్రిపురాన విజయ్
రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు
Comments
Please login to add a commentAdd a comment