ట్రాక్ రికార్డ్
● 2022–23, 2024–25 రెండు సీజన్లలో ప్రతిష్టాత్మక రంజీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రా పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు.
● అండర్–19 విభాగంలో ఏసీఏ నార్త్‌జోన్ పోటీల్లో 6 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీయడంతోపాటు 265 పరుగులు సాధించి ఉత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.
● అంతర్ రాష్ట్ర అండర్–25 వన్డే క్రికెట్ టో ర్నీలో హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో 4.4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లను ఆకర్షించాడు.
● 2021–22లో అంతర్రాష్ట్ర అండర్–23 క్రికెట్ టోర్నీలో మెరుగ్గా రాణించడంతో బీసీసీఐ నిర్వహిస్తున్న బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికై శిక్షణ పొందారు.
● ఆంధ్ర ప్రీమియం లీగ్(ఏపీఎల్) టీ–20 క్రికెట్ పోటీల్లో మూడు సీజన్లలోనూ రాణించా డు. రాయలసీమ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 63 పరుగులు సాధించి అజేయంగా నిలిచి విశేషంగా ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లోను సత్తాచాచడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు.
● ఏపీఎల్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల్లో బెస్ట్ ఫీల్డర్‌గా మరో రూ.50వేల నగదు బహుమతిని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చేతులమీదుగా అందుకున్నాడు.
● గత సీజన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన విదర్భపై తన మొదటి మ్యాచ్‌లోనే నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment