ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పర్యటన
పలాస: ప్రజల జీవనాధారమైన ఉద్దానం జీడి తోట ల మధ్య ఎయిర్ పోర్టు నిర్మాణం చేయాలన్న ఆలోచనను నిలుపుదల చేయాలని వివిధ ప్రజా సంఘా ల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాస నియోజకవర్గంలోని ఉద్దానం ప్రాంతంలోని గ్రామా ల్లో సోమవారం పర్యటించారు. ప్రజలను కలసి ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల తలెత్తిన సమస్యలను వివరించారు. ఎయిర్ పోర్టు నిర్మాణ వ్యతిరేక పోరా ట కమిటీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొత్తం 20 గ్రామాల పరిధిలో గ్రీన్ఫీల్డ్ కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టడం వల్ల రైతులకు చాలా నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు పోతనపల్లి కుసుమ, కుత్తుం హేమక్క, జానకమ్మ, యువజన నాయకులు సార జగన్, రాపాక మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment