నిర్వాసితులపై కేసు కొట్టివేత
కొత్తూరు: వంశధార నిర్వాసితులపై 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సోమవారం కొట్టి వేసినట్లు నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం ఓ ప్రకటనలో తెలిపారు. వంశధార నిర్వాసితులకు ప్రభుత్వ నుంచి రావాల్సిన పునరావాస ప్యాకేజీలు చెల్లించాలంటూ మండలంలోని ఇరపాడు గ్రామంలో సమావేశం జరిగింది. సమావేశంలో 144 సెక్షన్ ఉల్లంఘించినట్లు గంగరాపు సింహాచలంతో పాటు బొంతల నారాయణరావు, మోజూరు అప్పడు, వాలిపిల్లి సింహచలం, ఆలికాన ఆనందరావులు పై కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు ఎనిమిదేళ్ల పాటు జరిగిన విచారణ అనంతరం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కె.రాణి కేసులు కొట్టేస్తూ తీర్పునిచ్చారని కేసు వాదించిన న్యాయవాది ఎం. అప్పారావు చెప్పారు.
జియోట్యాగ్ అయిన వాహనాలతో మాత్రమే రవాణా
జలుమూరు: రైతులు విక్రయించే ధాన్యం బస్తాలను ఆయా మిల్లులకు జియో ట్యాగ్ అయిన వాహనాలతో మాత్రమే రవాణా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహ్మద్ ఖాన్ అన్నారు. సోమవారం టెక్కలిపాడు రైస్ మిల్లు ను తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ప్రధానంగా బ్యాంక్ గ్యారెంటీలు చూసుకోవాలన్నా రు. ట్రక్ షీట్ జనరేట్ అయిన వారం రోజుల్లో అమ్మకాల ప్రక్రియ పూర్తవ్వాలన్నారు. ఆయా రైతు సేవా కేంద్రాల నుంచి షెడ్యూల్ విధిగా తీసుకోవాలన్నారు. ఆయనతోపాటు తహసీల్దార్ జెన్ని రామారావు, సీఎస్‌డీటీ షరీఫ్, ఆర్‌ఐ కిరణ్ సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment