మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా అపూర్వ రవళి
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా నుగూరి అపూర్వ రవళి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మిర్యాలగూడ కోర్టు నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న జె.ప్రశాంతి బదిలీపై హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి కోర్టుకు వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తికి బార్ అసోసియేషన్, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, న్యాయవాదులు ఎస్. రామరాజు, దండ వెంకట్ రెడ్డి, పెండెం వాణి, ఎండీ అబ్దుల్ లతీఫ్, ధరావతు వీరేష్ నాయక్ , అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.హేమలత, సీఐలు వై.సురేందర్ రెడ్డి, రాజశేఖర్, ఎస్‌ఐలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment