అన్నానగర్: కడలూరు యువకుడు చైనా యువతిని సోమవారం తమిళ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు. స్నేహితులు, బంధువులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. వివరాలు.. కడలూరు మంజకుప్పం పశ్చిమ వేణుగోపాలపురానికి చెందిన లక్ష్మణన్ కుమారుడు బాలచందర్. ఇతనికి న్యూజిలాండ్‌లో చైనాకు చెందిన యిజియోవుకి సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం చివరికి ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ తమ తల్లిదండ్రులను తమ అంగీకారాన్ని కోరారు.
వీరి ప్రేమకు ఇరు వర్గాల తల్లిదండ్రులు కూడా పచ్చజెండా ఊపారు. సంతోషంగా ఉన్న జంట అధికారికంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమిళ సంస్కృతి ప్రకారం కడలూరు ముత్తునగర్‌లోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో వీరి వివాహం సోమవారం జరిగింది. తమిళ సంప్రదాయం ప్రకారం, వరుడు సిల్క్ సూట్, చొక్కా ధరించి, వధువు పట్టుచీర, నగలు ధరించి పెళ్లి పీఠలపై కూర్చున్నారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ వరుడు, వధువు మెడలో తాళి కట్టారు. అనంతరం బంధువులు, స్నేహితులు వారిని అభినందించారు.
చైనా అమ్మాయి.. తమిళ అబ్బాయి!
Published Wed, Apr 12 2023 7:21 AM | Last Updated on Wed, Apr 12 2023 7:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment