![జూపోప్ యాప్‌ను ఆవిష్కరిస్తున్న కమలహాసన్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/14/13cni31-300105_mr_0.jpg.webp?itok=z9MGiyBs)
జూపోప్ యాప్‌ను ఆవిష్కరిస్తున్న కమలహాసన్
తమిళసినిమా: సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే ఖర్చు చేసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో సినీ నృత్య దర్శకుడు షరీఫ్ ఒకరని చెప్పవచ్చు. ఈయన సూదు కవ్వం చిత్రంతో నృత్య దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రముఖ నృత్య దర్శకుడిగా రాణిస్తున్నాడు. రజనీకాంత్, కమలహాసన్, అజిత్, విజయ్ ప్రముఖ హీరోల చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేస్తున్న ఈయన ఇప్పటి వరకు 150కి పైగా చిత్రాలకు పని చేశారు. ఈయన వద్ద పని చేసిన పలువురు అసిస్టెంట్లు ఇప్పుడు నృత్య దర్శకులుగా మారారు. పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్న షరీఫ్ తాజాగా డాన్స్, మ్యూజిక్ వంటి అంశాలతో కూడిన జూపోప్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక యాప్‌ను విన్సెంట్ అడైక్కలరాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ యాప్‌ను నటుడు కమలహాసన్ ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా నృత్య దర్శకుడు షరీఫ్ మాట్లాడుతూ.. మనిషికి ఎక్సర్‌సైజ్ అన్నది చాలా ముఖ్యమైందని తెలిసిందేనన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు పనుల్లో బిజీగా ఉండటంతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతున్నారని తెలిపారు. ఎక్సర్‌సైజ్‌కు సమయాన్ని కేటాయించలేకపోతున్నారని అన్నారు. అలాంటి వారు ప్రతిరోజు ఐదు నుంచి 10 నిమిషాలు వరకు సులభతరమైన నటన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment