ఉత్తర చైన్నె ప్రగతికి రూ. 5,780 కోట్లతో ప్రాజెక్టులు | - | Sakshi
Sakshi News home page

ఉత్తర చైన్నె ప్రగతికి రూ. 5,780 కోట్లతో ప్రాజెక్టులు

Published Thu, Oct 24 2024 1:41 AM | Last Updated on Thu, Oct 24 2024 1:41 AM

ఉత్తర చైన్నె ప్రగతికి రూ. 5,780 కోట్లతో ప్రాజెక్టులు

ఉత్తర చైన్నె ప్రగతికి రూ. 5,780 కోట్లతో ప్రాజెక్టులు

సాక్షి, చైన్నె: ఉత్తర చైన్నె ప్రగతికి రూ.5,780 కోట్ల అంచనాతో 225 ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టామని సీఎండీఏ చైర్మన్‌, హిందూ, దేవదాయ శాఖమంత్రి శేఖర్‌ బాబు తెలిపారు. ప్రస్తుతం రూ. 685 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రణాళిక లో భాగంగా వి.కె.నగర్‌, కనికాపురం రూ. 12.68 కోట్లతో చేపట్టిన క్రీడామైదానం, పురసైవాక్కంలో రూ. 12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు, బస్టాండ్‌, వర్క్‌ షాపు తదితర పనులను బుధవారం పీకే శేఖర్‌ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మార్గ దర్శకత్వంలో ఉత్తర చైన్నె అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని వివరించారు. ఉత్తర చైన్నె ప్రణాళికలో భాగంగా 140 పనులు చేపట్టామని, వర్క్‌ ఆర్డర్లు, కాంట్రాక్టులు అప్పగించామన్నారు. రూ.668 కోట్లతో చేపట్టిన 28 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయన్నారు. ఇందులో పార్కులు, బీచ్‌లు, నీటి పరివాహక ప్రదేశాలు, బస్టాండ్‌లు, హౌసింగ్‌ స్కీమ్‌, స్కూల్స్‌, క్రీడా మైదానాలు, మార్కెట్లు, తదితర పనులు ఉన్నాయని వివరించారు. ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రాజెక్టును తలుత రూ.4,228 కోట్లతో చేపట్టదలచినా, ప్రస్తుతం ఆ మొత్తం రూ. 5,500 కోట్లకు చేరినట్టు తెలిపారు. మొత్తంగా రూ. 5,780 కోట్లను వెచ్చిస్తున్నామన్నారు. సీఎండీఏ రూ. 1000 కోట్లను కేటాయించిందన్నారు. ఒకటి, రెండు, మూడు విడతలలో ఈ ప్రగతి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాయగం కవి, హసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాకర్ల ఉషా, సీఎండీఏ సభ్య కార్యదర్శి అన్సుల్‌ మిశ్రా, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement