తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులు.. ప్రత్యర్థి కాంగ్రెస్సే: కేటీఆర్‌ | KTR Serious Comments On CM Revanth Reddy And Congress, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులు.. ప్రత్యర్థి కాంగ్రెస్సే: కేటీఆర్‌

Published Sat, Oct 26 2024 9:32 AM | Last Updated on Sat, Oct 26 2024 10:26 AM

KTR Serious Comments On Cm Revanth And Congress

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తెలంగాణలో ఉద్యమం నాటి పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీనే.. ప్రజల పక్షాన బీఆర్‌ఎస్సే ఉందంటూ కామెంట్స్‌ చేశారు.

కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. 

  • తెలంగాణలో ఉద్యమం నాటి పరిస్థితులు..

  • మళ్లీ ప్రత్యర్థి కాంగ్రెస్సే..ప్రజల పక్షానా బీఆర్ఎస్సే!!

  • రైతు భరోసా, రైతు రుణమాఫీతో రైతులను దోఖా చేసిన అమానుషం..ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయని దుర్మార్గం..

  • ఏడాదిలో 2లక్షల ఉద్యోగాల జాతర అనే హామీకి పాతరేసి నిరుద్యోగుల ఆశలను చిదిమేసిన విధానం... రోడ్డెక్కినా కనికరించని కాఠిన్యం

  • నాడు బీఆర్ఎస్ హయాంలో సకల జనుల సంక్షేమ తెలంగాణ..నేడు కాంగ్రెస్ పాలనలో సంక్షోభం వైపు పయనం!!

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అగ్గై మండుతున్న తెలంగాణం...సర్కార్ విధానాలపై తిరగబడుతున్న జనం

  • తెలంగాణ దళం..గళం ఎప్పటికీ బీఆర్ఎస్సే..పేగులు తెగేదాకా ప్రజల కోసం కొట్లాడుతాం.. తెలంగాణను అవకాశవాదుల నుంచి కాపాడుకుంటాం

  • జై తెలంగాణ అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement