ఈ రాశివారికి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి | Today Telugu Horoscope On October 26th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి

Published Sat, Oct 26 2024 6:43 AM | Last Updated on Sat, Oct 26 2024 8:33 AM

Daily horoscope october 26 telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.నవమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: పుష్యమి ప.12.09 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.1.36 నుండి 3.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.09 నుండి 12.57 వరకు, అమృత ఘడియలు: ఉ.5.33 నుండి 7.10 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.55, సూర్యాస్తమయం: 5.39. 

మేషం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

వృషభం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులు సహకరిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు ఒత్తిడులు.

కర్కాటకం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రశంసలు అందుకుంటారు.

సింహం: అనుకోని ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. వాహనయోగం. దైవచింతన.

తుల: పాతబాకీలు వసూలవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆలయాల సందర్శనం. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: దూరప్రయాణాలు. బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగమార్పులు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం.

ధనుస్సు: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు చేస్తారు.

మకరం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. ప్రముఖుల పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి  ఆహ్వానాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మీనం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో  ఆటంకాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement