● ఎయిర్ ఫోర్స్ అధికారుల నివాళి
తమిళసినిమా: నటుడు ఢిల్లీగణేశ్ భౌతిక కాయానికి సోమవారం స్థానిక నెసపాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. అంతకు ముందు రామాపురంలోని ఇంటి వద్ద సందర్శకుల దర్శనార్థం ఢిల్లీగణేశ్ భౌతికకాయాన్ని ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన తిక కాయానికి నివాళులర్పించారు. నటుడు నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, నటుడు సత్యరాజ్, వడివేలు, సూరి, ప్రభుదేవా, సెంథిల్, ముత్తుకాళై, దర్శకుడు కేఎస్.రవికుమార్, వెట్రిమారన్, వసంత్, లింగుసామి, నటి దేవయాని, పసి సత్య తదితరులు నివాళులర్పించారు. అలాగే నటుడు ఢిల్లీగణేశ్ సినిమా రంగప్రవేశం చేయక ముందు ఎయిర్‌ఫోర్స్‌లో పని చేశారు. దీంతో ఎయిర్‌ఫోర్ అధికారులు ఆయన భౌతిక కాయానికి జాతీయ పతాకాన్ని కప్పి, నివాళులర్పించారు. అనంతరం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీ గణేశ్ భౌతిక కాయాన్ని రామాపురంలోని సొంత ఇంటి నుంచి ఊరేగింపుగా స్థానికి నెసపాక్కంలోని శ్మశాన వాటిక వరకూ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీగణేశ్ కొడుకు మహా ఢిల్లీగణేశ్ కర్మకాండ నిర్వహించారు.
నటుడు ఢిల్లీగణేశ్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న ఎయిర్‌ఫోర్స్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment