ఘనంగా ‘ధర్మనిధి’ సదస్సు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘ధర్మనిధి’ సదస్సు

Published Thu, Nov 28 2024 1:53 AM | Last Updated on Thu, Nov 28 2024 1:53 AM

ఘనంగా ‘ధర్మనిధి’ సదస్సు

ఘనంగా ‘ధర్మనిధి’ సదస్సు

తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో పోపూరి వేంకట సుబ్బారావు స్మారక ధర్మనిధి సదస్సును బుధవారం సావేరీ సెమినార్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖాధ్యక్షులు కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ మహిళల వేదన, బాధలు, తమను తాము ఆవిష్కరించుకునే తీరును సీ్త్రల జీవితచరిత్రలు తెలియజేస్తాయన్నారు. రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో తన అనుబంధం, వర్సిటీ స్థాపనలో తండ్రి పోపూరి వేంకట సుబ్బారావు అనుభవాలను పంచుకున్నారు. సీ్త్ర విద్య ఉపయోగాలను విశదీకరించారు. అనంతరం స్రీ సామాజిక భద్రత అనే అంశంపై నిర్వహించిన కథల పోటీలలో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. డాక్టర్‌ యువశ్రీ, ప్రొఫెసర్‌ కాత్యాయని, వి ప్రతిమ, డాక్టర్‌ సుభాషిణి, డాక్టర్‌ లక్ష్మీ ప్రియ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement