సేవకులకు అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాల్లో సేవలు, మానవతా దృక్పథం వంటి సామాజిక సేవలు చేస్తున్న లయన్స్ క్లబ్‌లకు అవార్డులను సోమవారం రాత్రి ప్రదానం చేశారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ 324ఎం జిల్లా నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా గవర్నర్ ఎన్. వరదరాజన్ పాల్గొని సమాజానికి సేవ చేస్తున్న వారికి జిల్లా ఫస్ట్ అవార్‌ుడ్స పేరుతో అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో లయన్స్ క్లబ్ ఆఫ్ సౌత్ సిటీ అధ్యక్షురాలు డాక్టర్ ఏవీ శివకుమారికి ఆరు అవార్డులను జిల్లా గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ ఎస్ .బోస్, సెకండ్ జిల్లా గవర్నర్ రాజేష్ ఎం.జోషి పాల్గొన్నారు.
15న అన్నాడీఎంకే
సర్వసభ్య సమావేశం
సాక్షి, చైన్నె: డిసెంబరు 15వ తేదీన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెడుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి బుధవారం ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించి తీర్మానాలు చేయనున్నారు. అలాగే డిసెంబరు 5న దివంగత సీఎం జయలలిత వర్ధంతి కార్యక్రమాలకు నిర్ణయించారు.
ముగ్గురు చైన్ స్నాచర్స్ అరెస్ట్
అన్నానగర్: చైన్నె కొలత్తూరు పూంబుహార్ నగర్ 6వ క్రాస్ వీధికి చెందిన విజయలక్ష్మి(63). మంగళవారం సాయంత్రం తన సోదరి వసంతతో కలసి దుకాణానికి వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసింది. కొళత్తూరు వీవీగగర్ 2వ వీధిలో ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా బైకు పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని 5 సవర్ల తాళి చైన్‌ను లాక్కొని పరారయ్యారు. కొళత్తూరు పోలీసులు రాజమంగళం, పుళల్ ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనతో పోల్చి చూడగా ఒక్కరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఆమేరకు తిరువళ్లూరు జిల్లా పుదు గుమ్మిడిపూండి కందిగై ప్రాంతానికి చెందిన ధనుష్ (19), బాలకృష్ణాపురం ప్రాంతానికి చెందిన దినేష్‌కుమార్ (20), 17 ఏళ్ల బాలుడిని బుధవారం ఉదయం అరెస్టు చేశారు. వారి నుంచి మూడు చైన్‌లు, సెల్‌ఫోన్‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment