తిరువొత్తియూరు: హత్య కేసులో బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు కోర్టుకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన నలుగురిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కొలపాకంలో 2014వ సంవత్సరం కన్స్ట్రక్షన్స్ పనిజరుగుతున్న చోట అసోం చెందిన జూబిన్ థియెరి (21) అనే అతను హత్య చేయబడ్డాడు. ఈ కేసులో అతనితో పాటు సహా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందిన సురేష్, బిందు, అమృతలాల్, జితేందర్లను అరెస్టు చేశారు. తర్వాత వారు బెయిల్పై బయటకు విడుదలై వచ్చారు. వారు కోర్టుకు హాజరు కాకుండా ఐదు సంవత్సరాలుగా అజ్ఞాతంలోకి వెళ్లారు.ఈ క్రమంలో ప్రత్యేక బృందం పోలీసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ ఉన్న సురేష్, జితేందర్ను తిరువళ్లూరు జిల్లాకు చెందిన పోలీసులు అమృతలాల్ను తిరునీర్మలై ప్రాంతంలో బిందు అనే అతని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment