బాల్యవివాహాలు లేని భారత్ స్థాపిద్దాం
కొరుక్కుపేట: బాల్యావివాహాలు లేని భారతదేశాన్ని స్థాపించుకుందామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ–చైన్నె సౌత్ చైర్మన్ రాజ్‌కుమార్ ముత్తుకృష్ణన్ పిలుపునిచ్చారు. ఈమేరకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూఓ), జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రెన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కార్యక్రమం బాల్య వివాహాలు లేని భారత్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఐసీడబ్ల్యూఓ ప్రధాన కార్యదర్శి ఏజే హరిహరన్ అధ్యక్షతన చైన్నె అన్నానగర్ వెస్ట్ వల్లలార్ కాలనీలోని ఐసీడబ్ల్యూఓ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే భారీ బ్యానర్‌ను రాజ్‌కుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ చట్టాలు అమలులో ఉన్నా ఇంకా బాల్య వివాహాలను అడ్డుకోలేకపోతున్నామని అన్నారు. కొవ్వొత్తులు వెలిగించి బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఏ.భక్తవత్సలం , ఏవీఏ– అసోసియేషన్ ఫర్ వలంటీర్స్ యాక్షన్ స్టేట్ కో–ఆర్డినేటర్ నాదర్షా మాలిమ్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment