క్లుప్తంగా
విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి
వేలూరు: విద్యుత్‌షాక్‌కు గురై ఇద్దరు పంపు ఆపరేటర్లు మృతిచెందారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గంలోని రంగప్పన్ కోటాయి ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు నాటేందుకు వేపంకుప్పం పంపు ఆపరేటర్‌లు వినాయకపురానికి చెందిన ముత్తుకుమరన్(45), అశోక్‌కుమార్(55) వెళ్లారు. బుధవారం సాయంత్రం విద్యుత్ స్తంభాలు నాటడం పూర్తి కావడంతో విద్యుత్ తీగలు లాగుతుండగా పక్కన ఉన్న విద్యుత్ తీగ రాసుకొని విద్యుత్ సరఫరా అయింది. ఆ సమయంలో విద్యుత్ తీగలు పట్టుకొని లాగుతున్న ముత్తుకుమరన్, అశోకుమార్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపి వేసి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చీర అంటుకుని
వృద్ధురాలు..
అన్నానగర్: చీరకు దీపం అంటుకుని ఓ వృద్ధురాలు మృతిచెందింది. చైన్నెలోని విరుగంబాక్కం సాయి నగర్‌కు చెందిన కనక (83). ఈమె తన సోదరుడు రామ్మూర్తి ఇంట్లో ఉంటోంది. 10 రోజుల క్రితం రామమూర్తి పని నిమిత్తం ఊరికి వెళ్లాడు.ఈ పరిస్థితిలో మంగళవారం సాయంత్రం ఎప్పటిలాగే అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కనకకు రాత్రి భోజనం పెట్టేందుకు వచ్చి చూడగా కనక ఇంట్లోనే కాలిన స్థితిలో శవంగా పడి ఉంది. వంటనే విరుగంపబాక్కం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేకే నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం కనక ఇంట్లో దీపం వెలిగించినపుడు చీరకు మంటలు అంటుకుని మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విరుగంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి కేసులో
మూడేళ్ల జైలు
అన్నానగర్: గంజాయి కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. తేని జిల్లాలోని దేవా పోలీస్‌స్టేషన్‌న్‌కు పక్కా సమాచారంతో 2019 నవంబర్ 9న పోలీసులు రంగనాథపురం రోడ్డులోని చిన్న దేవికులం సమీపంలో గస్తీలో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బైకును తనిఖీ చేయగా 8 కిలోల గంజాయిని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి దేవరం పాచియమ్మన్ కోవిల్ స్ట్రీట్ ప్రాంతంలో మహేశ్వరన్ (40) అరెస్టు చేసి జైలుకు తరలించారు. 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మదురై జిల్లా ప్రిన్సిపల్ ఈసీ, ఎన్టీపీఎస్ ప్రత్యేక కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితిల్లో బుధవారం జరిగిన విచారణలో న్యాయమూర్తి హరిహరకుమార్ నిందితుడు మహేశ్వరన్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా విధించారు.
గంజాయి తరలింపు:
ఆరుగురి అరెస్ట్
తిరువొత్తియూరు: గంజాయి కేసులో యువతి సహా ఆరుగురు అరెస్ట్ అయ్యారు. చైన్నె తిరువొత్తియూరు పెరుమాళ్ ఆలయం వీధికి చెందిన పృథ్వీరాజ్ (24). ఇతను గంజాయి వ్యాపారి. మనలి శ్రీనివాసన్ వీధికి చెందిన జోష్వా (23), తాంబరానికి చెందిన భరత్ (22). వీరందరిని గంజాయి విచారణ కోసం తిరువొత్తియూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు ప్రాంగణంలో ఉండగా వారు గంజాయి కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరువొత్తియూరు పోలీసులు అక్కడికి చేరుకుని వారి వద్ద విచారణ చేశారు. ఇందులో గంజాయి కేసులో సంబంధం ఉన్న ఎర్నాఊరు సునామీ క్వార్టర్స్‌కు చెందిన నందిని (22), అనే యువతి పుళల్ జైలులో ఉన్న తన భర్త విజయ్‌కు ఇచ్చేందుకు రాజాతీనగర్ మురళి, యోగేశ్వరన్ అనే వారి మూలంగా కోర్టుకు హాజరై పైన తెలిపిన వారికి గంజాయి ఇచ్చి పంపేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో ఇన్‌స్పెక్టర్ రజనీష్ విచారణ చేసి నందిని, మురళి సహా ఆరుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.
50 సవర్ల నగలు చోరీ
తిరువొత్తియూరు: చైన్నె కార్పొరేషన్‌లో అధికారిగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు 50 సవర్ల నగలను చోరీ చేశారు. మాధవరం సారంగపాణి వీధికి చెందిన ఆనందరాజ్. ఐటీ సంస్థలో అధికారి. ఇతని భార్య కవిప్రియ చైన్నె కార్పొరేషన్‌లో సహాయ ఇంజినీర్. కవిప్రియ ఓ కార్యక్రమానికి నగలు వేసుకొని వెళ్లడానికి బీరువాలో ఉంచిన నగల కోసం చూడగా 40 సవర్ల నగలు అదృశ్యమై ఉన్నాయి. దీంతో గత కొన్ని రోజుల క్రితం 10 సవర్ల నగలు అదృశ్యమయ్యాయని, ఈ క్రమంలో తక్కిన నగలు చోరీ అయినట్లు ఆమె గుర్తించారు. బీరువా పగలగొట్టకుండా ఉండడంతో ఇంటికొచ్చేవారే నగలను చోరీ చేసి ఉండొచ్చని తెలిసింది. దీనిపై మాధవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment