ఐఐటీ మద్రాస్‌లో.. స్పేస్ క్రాఫ్ట్ అధ్యయన కేంద్రం
సాక్షి, చైన్నె: చైన్నెలోని ఐఐటీ మద్రాసులో స్పేస్ క్రాఫ్ట్ – లాంచ్ వెహికల్ థర్మల్ మేనేజ్‌మెంట్‌ను అధ్యయనం చేయడం లక్ష్యంగా పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఇస్రో భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. సోమవారం ఇందుకు సంబంధించిన ఒప్పందాలు చైన్నెలో జరిగాయి. శ్రీసెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్‌శ్రీ అనే వివిధ భాగాల రూపకల్పన, విశ్లేషణ, పరిశోధనలకు సంబంధించి ఉష్ణ సమస్యలను అధ్యయనం చేయడం లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఈ కేంద్రం నెలకొల్పేందుకు ఇస్రో రూ.1.84 కోట్ల సీడ్ ఫండింగ్‌ను అందించనుంది. ఈ కేంద్రం అంతరిక్ష నౌకలకు నోడల్ కేంద్రంగా పని చేయడమే కాకుండా, ఇస్రో వాహన సంబంధిత ఉష్ణ నిర్వహణ పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ కేంద్రం ద్వారా ఐఐటీ మద్రాస్ అధ్యాపకుల నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడంతో వివిధ భాగాల రూపకల్పన, విశ్లేషణ, పరీక్షలకు సంబంధించిన థర్మల్ సమస్యలను పరిష్కరించడానికి వీలుంది. ఇందుకు సంబంధించి ఐఐటీ మద్రాస్‌లో సోమవారం అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఐఐటీ మద్రాస్ డీన్ (ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్) ప్రొఫెసర్ మను సంతానం, ఇస్రో డైరెక్టరేట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ – ఇన్నోవేషన్(డీటీడీఐ) డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ అరవింద్ పట్టమట్ట సమక్షంలో ఐఐటీ మద్రాసు మెకానికల్, ఇంజనీరింగ్ విభాగాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ పట్టమట్ట మాట్లాడుతూ శ్ఙ్రీఈ సెంటర్ ఒక ప్రత్యేకమైన పరిశ్రమ–అకాడెమియా ఇంటర్‌ఫేస్‌ను ప్రోత్సహిస్తుందన్నారు. ఇది ఇస్రో శాస్త్రవేత్తలు , ఐఐటీ మద్రాస్ అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి కీలకమైన రంగాలలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుందన్నారు. ఉష్ణశాస్త్రం. సంక్లిష్టమైన థర్మల్ ఇంజినీరింగ్ సవాళ్లను పరిష్కరించడం ద్వారా దేశంలో అంతరిక్ష కార్యక్రమానికి గణనీయమైన సహకారం అందించడం, అంతరిక్ష సాంకేతికతలలో భారతదేశ స్వావలంబనను బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. దేశం కోసం నిజమైన స్వావలంబన, స్వీయ–ఉత్పత్తి అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధునాతన విద్యా పరిశోధన ద్వారా ప్రాథమిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేయవలసిన అవసరాన్ని గుర్తించామన్నారు. అందుకే ఇస్రో, ఐఐటీ మద్రాసు సంయుక్తంగా 1985లో స్పేస్ టెక్నాలజీ సెల్‌శ్రీను ఇక్కడ ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు.
అనేక విశిష్టతల సమాహారం..
థర్మల్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హబ్‌గా అంతరిక్ష నౌక, లాంచ్ వెహికల్ థర్మల్ మేనేజ్‌మెంట్ సవాళ్లపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. ఈ కేంద్రం ఇస్రోకు కీలక పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సెంటర్‌కు ఇస్రో ప్రారంభ సీడ్ ఫండింగ్ రూ. 1.84 కోట్లు అందించనుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, పరికరాల కోసం, వినియోగ వస్తువులు, నిర్వహణ, ద్రవ–థర్మల్ శాస్త్రాలలో భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం అదనపు నిధులు అవశ్యం కానుంది. అధునాతన పరిశోధన ప్రాజెక్ట్‌గా అంతరిక్ష నౌక ఉష్ణ నిర్వహణ, హైబ్రిడ్ రాకెట్‌లలో దహన అస్థిరత, క్రయో–ట్యాంక్ థర్మోడైనమిక్స్‌తో సహా క్లిష్టమైన ప్రాంతాలను కవర్ చేస్తాయి. పరిశ్రమ–అకాడెమియా సహకారంతో ఈ కేంద్రం ఇస్రో శాస్త్రవేత్తలు, ఐఐటీ మద్రాస్ ఫ్యాకల్టీ మధ్య సహకారాన్ని మెరుగుపరుస్తుంది, ద్రవం, ఉష్ణ శాస్త్రాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
● ఇస్రోతో భాగస్వామ్యంతో ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment