తంజావూరులో.. బుల్లి కొబ్బరి కాయ
సేలం : తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో నరికుడి గ్రామానికి చెందిన రైతు కాశీనాథన్ (60). ఇదే ప్రాంతంలో ఈయనకు సొంతమైన తోటలో ఉన్న కొబ్బరి చెట్టుపై నుంచి ఓ కొబ్బరి బొండంను తీశాడు. ఆదివారం దాని పీచును తొలగించగా లోపల కేవలం 2 సెంటీ మీటర్లు మాత్రమే గల బుల్లి కొబ్బరి కాయ ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. సాధారణంగా పీచుతో ఉన్న ఒక కొబ్బరి బొండం తీసుకుని, దాని పీచు తీస్తే కనీసం కిలో బరువు గల కొబ్బరికాయ ఉంటుంది. అదే విధంగా ఈ బుల్లి కొబ్బరి కాయ కూడా పీచుతో ఉన్నప్పుడు సాధారణంగా పెద్ద కొబ్బరికాయలాగానే కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ చిన్న కొబ్బరికాయను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సాయుధ దళాల విభాగం చీఫ్‌గా జె. సురేష్
● బాధ్యతల స్వీకరణ
సాక్షి, చైన్నె : చైన్నె కేంద్రంగా ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖలోని సాయుధ దళాల విభాగానికి ట్రై – సర్వీసెస్ వింగ్ చీఫ్( కమాండ ర్)గా భారత నావికాదళ సీనియర్ అధికారి కమోడోర్ జే సురేష్ నియమితులయ్యారు. సో మవారం ఆయన స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కమోడోర్ సురేష్‌కు లాజిస్టిక్స్, ట్రూప్ మూవ్‌మెంట్ వ్యూహాత్మక కార్యకలాపాలలో అపారమైన అనుభవం, నైపుణ్యం ఉంది. భారత నావికాదళంలో విశిష్టమైన కెరీర్‌లో సంక్లిష్టమైన సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడంలో, దేశ రక్షణకు అవసరమైన లాజిస్టికల్ విధులను సమన్వయం చేయడంలో తన సామర్థ్యాలను మెరుగు పరచుకోవడమే కాకుండా, వివిధ నాయకత్వ బాధ్యతలను చేపట్ట ఉన్నారు. ఇందుకు గుర్తింపుగా ఆయన నాయకత్వంలో చైన్నెలోని ఎంబార్కేషన్ హెడ్ క్వార్టర్స్ దళాలు పనిచేయనున్నాయి. అధికారులను సమన్వయం చేయడం, సైనిక సిబ్బందికి సహకారం, మద్దతు, లాజిస్టిక్స్ సేవలను దక్కే విధంగా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ఇది వరకు చీఫ్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన కమోడోర్ జే గురుమణికి ట్రై ఆర్మీ డివిజన్ అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. గురు మణిని నుంచి సురేష్ బాధ్యతలు స్వీకరించారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment