ప్రైవేటు ఎగుమతి సంస్థలో ఈడీ సోదాలు
సాక్షి, చైన్నె : చైన్నె, చెంగల్పట్టులలోని ఆరు చోట్ల ఓ ప్రైవేటు ఎగుమతి సంస్థకు చెందిన కార్యాలయాలలో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం విస్తృతంగా సోదాలు చేశారు. వివరాలు.. మహారాష్ట్ర కేంద్రంగా సాగుతున్న ఓ సోలార్, విండ్ ఎనర్జీ కి సంబంధించిన పరికరాల సంస్థకు చెందిన కార్యాలయాలు, ఉత్పత్తి సంస్థలు చైన్నెతో పాటు చెంగల్పట్టులో ఉన్నాయి. విదేశాలకు ఎగుమతుల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టుగా గుర్తించిన ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో చైన్నె, చెంగల్పట్టులలో ఆ సంస్థకు చెందిన ఆరు చోట్ల ఉదయాన్నే భద్రత నడుమసోదాలలో నిమగ్నమయ్యారు. చైన్నెలో కొన్ని చోట్ల అతి పెద్ద భవనాలలో ఉన్న ఈ సంస్థ కార్యాలయాలలో నిఘా నీడలో సోదాలు సాగుతున్నాయి
Comments
Please login to add a commentAdd a comment