తమిళసినిమా: వివాదాస్పద నటి కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాలు.. కస్తూరి ఇటీవల హిందు మక్కల్ కట్చి బ్రాహ్మణుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలంటే పోరాటం నిర్వహించింది. ఆ పోరాటం కార్యక్రమంలో పాల్గొన్న నటి కస్తూరి తమిళనాడులోని తెలుగు ప్రజల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ, తెలుగు సంఘాలు మండిపడ్డారు. కస్తూరిపై చైన్నెలోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు నటి కస్తూరిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి ఆమెను విచారంచడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగా ఇటీవల స్థానికి పోయస్‌గార్డెన్‌లోని నటి కస్తూరి ఇంటికి వెళ్లి సమన్లు అందించడానికి వెళ్లగా ఆమె ఇంటిలో లేరు. ఇంటికి తాళం వేసిఉంది. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో పోలీసులు కస్తూరి ఇంటికి సమన్లు అంటించి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి కస్తూరి సోమవారం మదురై కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆమె పేర్కొటూ తాను తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు వివాదానికి తెరలేపారన్నారు. అయితే అందుకు తాను వారికి క్షమాపణ కూడా చెప్పానని అయినా రాజకీయ దురుద్దేశంతో తనపై కేసులు పెట్టారని, కాబట్టి ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కస్తూరి పిటిషన్‌ను మంగళవారం న్యాయమూర్తి ఆనంద్ సమక్షంలోని బెంచ్ విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment