● ఉత్తర్వుల జారీ
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని ఆస్పత్రులలో ఎమర్జన్సీ, డయాగ్నోస్టిక్స్ సేవలను విస్తృతం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు విస్తృతం చేసింది. ఇప్పటికే 28 క్రిటికల్ కేర్ యూనిట్లు, 20 డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ సెంటర్లను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోగా, ఈ పనులు వివిధ దశలలో ఉన్నాయి. ఈ పరిస్థితులలో పెరంబలూరు, తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి , వేలూరు జిల్లా అనైకట్టు ఆస్పత్రులలో ఒక్కో ఆస్పత్రికి రూ. 23 కోట్లతో తలా 50 పడకలతో అత్యవసర సేవా విభాగం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆరోగ్య శాఖ జారీ చేసింది. ఇందుకోసం మొత్తం రూ.71 కోట్లు కేటాయించారు. అలాగే, ఉలుందూరుపేట (కల్లకురిచి జిల్లా), కంబం (తేని జిల్లా), పెరంబలూరు (పెరంబలూరు జిల్లా), వేదారణ్యం (నాగపట్నం జిల్లా), కారైకుడి (శివగంగై జిల్లా) తలా రూ. 1.25 కోట్లతో వైద్య సంబంధించి ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆదేశించారు. అత్యవసర విభాగంలో థెరప్యూటిక్ కేర్ యూనిట్, ఐసోలేషన్ స్పెషల్ కేర్ యూనిట్, మోడ్రన్ ఆపరేటింగ్ థియేటర్లు, అధిక సామర్థ్యం గల ఆక్సిజన్ వ్యవస్థలు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర సేవల నిమిత్తం 50 పడకలతో విభాగాల ఏర్పాటు చేయడానికి ఇన్‌స్టాల్ చేయబడిన ఇంటెన్సివ్ కేర్ బెడ్‌లు, వెంటిలేటర్లు, అనస్థీషియా వర్క్‌స్టేషన్లు, ఆధునిక శస్త్రచికిత్స ట్రీట్‌మెంట్ హాల్స్‌తో సహా అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment