విద్యార్థులకు మత్తు పదార్థాల విక్రయం
● నలుగురు యువకుల అరెస్టు
సేలం : పట్టినపాక్కంలో విద్యార్థులకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా, గంజా వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడే యువకుల సంఖ్య అధికమవుతున్న స్థితిలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలో చైన్నెలో మెతబేటమైన్ అనే మత్తు పొడి అధికంగా సాగుతోంది. ఇటీవల దీనికి సంబంధించి పలువురుని పోలీసులు అరెస్టు చేసి చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో చైన్నె పట్టినపాక్కం ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో కొందరు యువకులు బస చేసి కళాశాల విద్యార్థులకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్టు సెయింట్ థామస్ మౌంట్ డిప్యూటీ కమిషనర్ సెల్వ నాగరత్నంకు సమాచారం అందింది. ఆ మేరకు పోలీసులు మడిపాక్కంలో ఒక ఇంటిలో ఉంటూ డీజే వ్యాపారం చేస్తున్న ప్రతీప్ (27)ను, అతను ఇచ్చిన సమాచారం మేరకు ఆదంబాక్కంకు చెందిన గోకులకృష్ణన్ (23), వేళచ్చేరికి చెందిన అశ్విన్ (24), విల్లివాక్కంకు చెందిన షాబుదీన్ (24) అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి 23 గ్రాముల కొకై న్, 4 గ్రాముల మెతబేటమైన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment