కనీస పింఛన్ కేటాయించాలి
తిరువళ్లూరు: రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ అయిన అంగన్వాడీ, పౌష్టికాహార ఉద్యోగులకు నెలకు కనీసం రూ.7,850 పింఛన్‌గా ఇవ్వాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో వున్న అంగన్వాడీ, పౌష్టికాహార ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా తమిళనాడు పౌష్టికాహార అంగన్వాడీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరమ్మాల్, తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇళంగోవన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివ్య హాజరయ్యారు. సుందరమ్మాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment