కొరుక్కుపేట: కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు వాల్టర్స్ కువేర్ సంస్థ ఉపాధ్యక్షుడు జోష్ అండర్వుడ్ సూచించారు. చైన్నెలోని మూకాంబిగైనగర్, కళ్లేకుప్పంలోని అరుణోదయం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుపుతున్న విద్యార్థి వసతి గృహాలకు అమెరికాకు చెందిన వాల్డర్స్ క్లువేర్ సంస్థ 18 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ ప్యానెల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆట్రస్టు నడుపుతున్న బాలికల వసతి గృహానికి 10 కిలోవాట్ల విద్యుత్, బాలుర వసతి గృహానికి 8 కిలోవాట్ల విద్యుత్ సరఫరా అయ్యేలా ఈ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను జోష్ అండర్వుడ్ ప్రారంభించారు ఆ సంస్థ చైన్నె శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వైద్యనాథన్, అరుణోదయం ట్రస్టు వ్యవస్థాపక మేనేజింగ్ ట్రసీ అయ్యప్పన్ సుబ్రమణియన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment