క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Wed, Nov 13 2024 12:20 AM | Last Updated on Wed, Nov 13 2024 12:20 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

పిల్లిని వేటాడుతూ..బావిలో పడిన పులి

సేలం : పిల్లిని వేటాడుతూ బావిలో పడిన పులి వలలో చిక్కుకుని తర్వాత తప్పించుకుని పారిపోయిన ఘటన ధర్మపురి జిల్లా పాలక్కోడులో మంగళవారం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా పాలక్కోడు సమీపంలోని మారన్‌డ హల్లి చంద్రాపురం గ్రామానికి చెందిన రైతు మాదన్‌. గ్రామంలో ఇతనికి సొంతమైన రైతు బావి ఉంది. ఆ బావిలో నుంచి పిల్లి అరుపుల శబ్ధం విన్న ఓ స్థానికుడు బావిలోకి చూడగా అక్కడ పిల్లితో పాటు పులి ఎదురెదురుగా ఉండడం చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి వలతో వాటిని బావి నుంచి బయటకు తీశారు. ఈ క్రమంలో వలలో నుంచి పులి తప్పించుకుని పారిపోయింది. దీంతో చేసేది లేక అటవీ శాఖ అధికారులు గ్రామంలో పులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకు ద్వారా హెచ్చరించారు.

రైల్వే ఇనుము చోరీ చేసిన యువకుడి అరెస్టు

తిరువొత్తియూరు: అన్ననూరు రైల్వేస్టేషన్లో రైలు పట్టాల ఇనుము చోరీ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆవడి సమీపంలోని అన్ననూరు రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారం పక్కన పడి ఉన్న రైలు పట్టాలకు సంబంధించిన ఇనుప కమ్ములు తరచు చోరీ అవుతున్నాయి. దీని గురించి రైల్వే భద్రత దళం ఇన్‌స్పెక్టర్లు సచిన్‌ కుమార్‌, నవీన్‌ కుమార్‌, సబ్‌ ఇన్స్పెక్టర్లు అయ్యప్పన్‌, కార్తికేయన్‌ తీవ్రంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రైలు పట్టాలకు సంబంధించిన ఇనుమును అంబత్తూరు సమీపంలోని వరగడం ప్రాంతానికి చెందిన కార్తీక్‌ గుర్తించి అరెస్టు చేశారు.

యువకుడి బలవన్మరణం

తిరుత్తణి: తిరుత్తణి రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన ఆనంద్‌బాబు(31) ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. ఇతని తల్లితండ్రులు రెండేళ్ల కిందట మృతిచెందారు. చెల్లికి వివాహం కావడంతో భర్తతో తిరుపతిలో ఉంటోంది. తిరుత్తణి లోని ఇంట్లో ఆనంద్‌బాబు ఒంటరిగా ఉంటున్నాడు. ఈక్రమంలో ఆనంద్‌బాబు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు సోమవారం రాత్రి తిరుత్తణి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ గుణశేఖర్‌ పోలీసులతో ఇంటి వద్దకు చేరుకుని ఇంటి తలుపు తెరిచి చూడగా బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆనంద్‌బాబు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆనంద్‌బాబు రెండు నెలల కిందట ఇంటిని విక్రయించేందుకు వీలుగా కొనుగోలుదారుడి నుంచి రూ.30 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు, ఆ డబ్బుతో నిత్యం మద్యం తాగి వుండేవాడని, ఒంటరితనం, మద్యంతో మానసికంగా కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం

ఒకరి మృతి

మరొకరి పరిస్థితి విషమం

తిరువళ్లూరు: ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తిరువళ్లూరు జిల్లా మేలానూర్‌ గ్రామానికి చెందిన శేఖర్‌(59). ఇతని భార్య శాంతి(49). వీరిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో దంపతులు ఇద్దరు కలసి కూలీ పనులకు సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. ఈకాడుకండ్రిగ వద్ద వెళుతుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుకు సమీపంలో ఆగివున్న లారీని ఢీ కొంది. ఈప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శేఖర్‌ మంగళవారం మృతిచెందాడు. శాంతిపరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చైన్నె వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ హాస్టల్‌ వార్డెన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

తిరువొత్తియూరు: తేని జిల్లాలో హాస్టల్‌లో వేధింపులకు గురి చేస్తున్న వార్డెన్‌పై విద్యార్థినులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలు.. తేని సమీపంలోని కోట్టూరులో ఆది ద్రావిడ సంక్షేమ ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో చదువుతున్న 60 మందికి పైగా విద్యార్థినులు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈక్రమంలో హాస్టల్‌ విద్యార్థినులు తేని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అందులో హాస్టల్‌ వార్డెన్‌గా ఉన్న శశిరేఖ, వంటమనిషి మాలతి విద్యార్థులను కొట్టడంతోపాటు అన్ని పనులూ చేయిస్తున్నారని, నాణ్యత లేని ఆహారం ఇస్తున్నారని ఆరోపించారు. దీని గురించి ఎవరికై నా ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్న ముగ్గురు విద్యార్థినులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే హాస్టల్‌కు చెందిన విద్యార్థినికి నోటిలో పచ్చిమిర్చి పెట్టి వేధించారని, దీంతో ఓ విద్యార్థిని స్పృహతప్పి చికిత్స పొందుతున్న వాపోయారు. దీంతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement