సాక్షి, చైన్నె : రైతుల సహకారంతో తాము కొత్త శిఖరానికి చేరుకున్నట్టు ఇంటర్నేషనల్ ట్రాక్టర్ లిమిటెడ్ జాయింట్ ఎండీ రామన్ మిట్టల్ తెలిపారు. 2024 అక్టోబరులో 20,056 సోనాలికా ట్రాక్టర్స్‌ను సిద్దం చేసి విక్రయాలలో రికార్డు సృిష్టించామని మంగళవారం స్థానికంగా ప్రకటించారు. ట్రాక్టర్‌ల చరిత్రలో అతిపెద్ద నెలవారీ పనితీరు రైతులకు అనుకూలీకరించినట్టు వివరించారు. ట్రాక్టర్‌ని కలిగి ఉండటాన్ని సులభతరం చేయడం, స్థిరమైన వ్యవసాయ శ్రేయస్సును అందించే విధంగా కొత్త యాంత్రీకరణ , మిషన్‌కు అనుగుణంగా పయనిస్తున్నామని పేర్కొన్నారు. అతిపెద్ద పండుగల సీజనన్‌లో ‘హెవీ డ్యూటీ ధమాకా’ రైతులకు సరసమైన ధరలకు అధునాతన సాంకేతికతతో నడిచే ట్రాక్టర్‌లను అందిస్తున్నామని ప్రకటించారు. రైతులు జీవితంలో ముందుకు సాగడానికి ఇది కీలక సహకారంగా ఉంటుందన్నారు.
పశువుల కాపరి అనుమానాస్పద మృతి
తిరువళ్లూరు: పశువుల కాపరి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ గ్రామానికి చెందిన కదిరవన్(21). ఇతను కూలీ పనులతో పాటు పశువులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 10న పశువులు తోలుకెళ్లిన కదిరవన్ సాయంత్రం ఇంటికి రాలే దు. బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఫలితం లేక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అ యితే పశువుల వద్దకు వెళ్లిన కదిరవన్ సమీపంలోని వ్యవసాయ భూమిలో అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించాడు. మృతుడి తండ్రి ఇరుదయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెన్‌కనికోటలో
ఏనుగు మృతి
అన్నానగర్: క్రిష్ణగిరి జిల్లా తెన్‌కనికోట సమీపంలో అటవీ మంగళవారం ఉరిగం అటవీ ప్రాంతంలో ఓ బండరాయికి దిగువన ఏనుగు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు గుర్తించి ఆ ఏనుగు ఎలా చనిపోయింది? అనే విషయంపై విచారణ చేపట్టారు. మరో మగ ఏనుగు దానిని ఎత్తయిన ప్రదేశం నుంచి తోసివేయడం వల్లే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఏనుగు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అక్కడే పూడ్చిపెట్టారు. మృతి చెందినది మగ ఏనుగు కావడంతో అటవీశాఖ అధికారులు దాని 2 దంతాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment